ఘర్ వాపసి

ఘర్ వాపసి ————- —ఇక్బాల్ చంద్ . 1. తరాంతరాంతర వాసిని – పూర్వ ముఖద్వారాలు త్యజించుకొని వొచ్చాక పూర్వీకుల ఆత్మలూ లేదా ప్రేతాత్మలూ నిర్మొహమాటంగానే తలుపులేసుకుంటాయి – 2. తుఫానులదేముందిలే ! వొస్తుంటాయి  పోతుంటాయి – సుడిగాలుల ఉప్పొంగు వరదలన్నింటినీ నిలబడి కాచుకొని చిగురిస్తోన్న చిగురుటాకుల మొలకలపై మదపుటెనుగుల గుంపు నర్తనం ! 3. నాకో గూడు కావాలి నిజమే గానీ ఏ గూడు సురక్షితం ? ఇది సొంత గూటికి చేరు అను అకాల…Continue reading ఘర్ వాపసి

సాయంత్రం

సాయంత్రం — ఇక్బాల్ చంద్ . 1. త్వరితంగా మిగిలివున్న పనుల్ని ముగించుకోవాలి ! పక్షులు గూటి విశ్రాంతి  కోరుకోంటున్నాయి , సముద్రం ఆకలిగా వుంది – జ్వరం తగ్గే సూచనలు లెవ , కనికరింపులు లేని నిర్దయ సంధ్య – 2. ఇష్టమైయ వారు చనిపోతే వారికిష్టమైన వస్తువుల్ని జ్ఞాపకంగా చాలా జాగ్రత్తగా దాచుకొంటారు  – కానీ, గ్రుహదహనం తర్వాత కాలికి చెప్పులు కూడా మిగలవు ఎప్పట్టికీ పూరించలేని ఖాళీ తనం – 3. ఒక…Continue reading సాయంత్రం

ఫిబ్రవరి

ఫిబ్రవరి   పొగమంచు కప్పుకొన్న దారి కనిపించని నిద్ర పట్టని కలలు కూడా జొరపడలేని వగరొగరు పచ్చి ద్రోహపు మాసం –   ఇక్కడ     ఎవరూ         ఎవరికోసం వేచి చూడరు ,   ఇక్కడ     ఎవరూ        ఎవరి కోసం నిరీక్షించరు .   బోలు హృదయపు       రిక్త హస్తాల           దొంగ కనుగీటుల మాసమిది                      …Continue reading ఫిబ్రవరి

ఆత్మహత్య

ఆత్మహత్య ఎటూ తోచని ఈ నెత్తుటి మోహనగరులో చెప్పుకోలేనంత నిరాసక్తత – దగ్ధ పుష్పవన రసహీన వాకిట్లో తుమ్మెద కాంక్ష కేవలం నిష్ప్రయోజనం – చెప్పుకోటానికేముందిలే ….. విషాద నాటకాంతంలో విషపాత్రికదే ఆఖరి చిర్నవ్వు !!!

చంద్ ముక్త్ – 3

చంద్ ముక్త్ – 3 వొక్క చేపా చిక్కలేదు ,       పైగా       వల చింపిరి పేలికలయింది – నాటు పడవ పచ్చిగా మోసం చేసింది ……. ఈత నేర్చుకోలేదని        నది మాత్రం జాలరిని        నిర్మొహమాటంగా శపిస్తోంది ! మిత్రులారా !      ఇది ఆఖరి రైలు !!!     —- ఇక్బాల్ చంద్.

చంద్ ముక్త్ -2 

చంద్ ముక్త్ -2 ముమ్మాటికీ    ఇది వెలి ప్రపంచం ! గది ,     గది కో గొళ్ళం ,         గొళ్ళానికో తాళం …… ఊహలు కూడా జొరబడని నిర్మానుష్యం ! చీకటి కొట్టం , రంగుల్లేని నీడలు సర్పనాట్యాల కౌగిలింతలు , తెగిన నాలుకలు నల్లటి నెత్తురుని చప్పరిస్తోన్న        వెగటు వివర్ణం నైట్ మేర్స్ !!!    

Iqbal Chand Poetry Anand

ఆనంద్

ఆనంద్ -ఇక్బాల్ చంద్ 1 శిల్ప చాతుర్యం శబ్ధ మాధుర్యం అల్లరిచిల్లరితనం అన్నీ  కలిపిన వొకానొక ప్రతీక ఆనంద్ –       పిల్లకాలువలకు బహురూపియ        ఎగిరే పక్షి రెక్కలే తన స్వప్నాలు –         హాస  పరిహాసాల పలుభాషల            పరిసరాల ఈస్థెటిక్స్ రూపి – ఆనంద్ చచ్చిపోయాడు –  2 ఎవరు  గుర్తిస్తారు ?  సన్నటి గీతల్లో అనంత…Continue reading ఆనంద్

చంద్ ముక్త్

చంద్ ముక్త్ -1 1 దారంతా దట్టంగా కప్పుకొని పుష్పరుతువు , ముందుకు సాగలేని ప్రయాణం – 2 అడివి, సుదూరం నీంచి నక్షత్ర కాంతి – బాట వెతుకుతోన్న ముసలి బాటసారి –   3 వోర్షం వెలసిన మసక రాత్రి తటాకం వొడ్డున మిణుగురులు కంటున్న స్వప్నాలను చెరుస్తో – 4 నాకో స్పర్శ కావాలంటున్నాడు చుట్టూతా మ్రుత హ్రుదయాలూ రిక్తహస్తాలూ చుంబించలేని పెదాలూ  ……  5 చిగురుటాకులు రాలుతున్న సంక్షుభిత క్షణాలు  –…Continue reading చంద్ ముక్త్

బుల్ బుల్-2

నాలుగు రోజులు రావడం ఆలస్యం అయిందని అలిగి మొహం పక్కకి తిప్పుకోకు – వొక్క నువ్వు నా ఏకైక వసంతం! పంజరం ఊచలకి తాకిన వాయు శబ్ధం పచ్చిగా భయపెడ్తోంది! వొక్కసారంటే వొక్కసారికి నిద్రలో నించి అయినా సరే చిర్నవ్వి పో! ఇలా పీడ కలల్తో ఉన్మత్తంగా ఆయువుని బాకీలా తీర్చుతున్నాను! బుల్ బుల్! పాట పాడు ! వందల చలిరాత్రులు వేన వేల రోహిణీ గ్రీష్మాల్లా ఉడికిపోతూ నిర్నిద్రిస్తున్నాను బుల్ బుల్ ! వొక్కసారి ముద్దాడిపో…Continue reading బుల్ బుల్-2